భారత్ కు కరవు ముప్పు: ప్రధాని

Manmohan Singh
న్యూఢిల్లీ: భారత్ కు కరవు ముప్పు పొంచి ఉందని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ హెచ్చరించారు. బహుముఖ పర్యావరణ సంక్షోభాలు దేశాన్ని ప్రమాదక పరిస్థితుల్లోకి నెడుతున్నాయని ఆయన అన్నారు. రాష్ట్రాల పర్యావరణ మంత్రులు సమావేశాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. వాతావరణ మార్పు మన ఎకో సిస్టమ్ ను దెబ్బ తీస్తోందని, నీటి కొరత జీవన విధానంగా మారుతోందని, కాలుష్యం వల్ల ఆరోగ్యం ప్రమాదకరంగా మారిందని ఆయన అన్నారు.

మన జీవనశైలులకు సంబంధించి ప్రాథమికావకాశాలను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పర్యావరణ స్థిరతతో, అభివృద్ధి మార్గాన్ని ప్రస్తుత, భవిష్యత్తరాలకు మనం అందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వాతావరణ మార్పుపై కేంద్రం రూపొందించిన జాతీయ కార్యాచరణ ప్రణాళికకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. జాతీయ ప్రణాళికతో అనుసంధానిస్తూ రాష్ట్ర స్థాయి ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+