హైదరాబాద్: ఓటమి బాధ నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తేరుకోలేకపోతున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి కె.రోశయ్య వ్యాఖ్యానించారు. ప్రజలు తనను ఎందుకు ఓడించారా అని మథనపడుతున్నారని, తాను ఓడిపోయినందుకే శాసనసభలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా అడ్డు పడుతున్నారని ఆయన మంగళవారం అన్నారు. ఆలస్యంగానైనా వర్షాలు పడుతుంటే చంద్రబాబు కడుపు మంటతో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ప్రజల సంతోషాన్ని చంద్రబాబు చూడలేకపోతున్నారని ఆయన అన్నారు.
కందిపప్పుకు బఠానీలు ప్రత్యామ్నాయం కాదని, అయితే బఠానీల ధర కూడా మార్కెట్లో ఎక్కువగా ఉందని, అందుకే బఠానీలను కూడా తక్కువ ధరకు పంపిణీ చేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు.