వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పబ్లిక్ స్టంట్ కాదు: షారూఖ్

By Staff
|
Google Oneindia TeluguNews

Shahrukh Khan
ముంబై: అమెరికాలో తన నిర్బంధం పబ్లిక్ స్టంట్ కాదని బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ అన్నారు. అమెరికా నుంచి మంగళవారం తిరిగి వచ్చిన ఆయన తనకు జరిగిన అవమానంపై వివరించారు. జరిగిన సంఘటనపై తనకేమీ కోపం లేదని, ప్రశ్నలతో విమానాశ్రయం అధికారులు అతిగా వ్యవహరించారని ఆయన అన్నారు. వారు అడిగిన ప్రశ్నలు ఏ మాత్రం బాగా లేవని, ఇది డ్రామా కాదని, తనకు పబ్లిసిటీ అక్కరలేదని, సాధారణంగా అనుసరించే పద్ధతిని అనుసరించలేదని, రంగును, జాతీయతను బట్టి తమ పట్ల వ్యవహరించడం సరి కాదని ఆయన అన్నారు.

విమానాశ్రయం అధికారులు ప్రశ్నించినందుకు తాను బాధపడడం లేదని, వారు పదే పదే వేసిన ప్రశ్ననే తనను బాధ పెట్టిందని ఆయన అన్నారు. నీ పేరు వెరీ కామన్ వంటి ప్రశ్నలతో బాధపెట్టారని ఆయన చెప్పారు. ఈ సంఘటన ద్వారా తన మై నేమ్ ఈజ్ ఖాన్ అనే సినిమాకు పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నట్లు వస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X