రఘువీరా రెడ్డి వ్యాఖ్యలపై దుమారం

రఘువీరా రెడ్డి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని తెలుగుదేశం సభ్యులు డిమాండ్ చేశారు. మంత్రి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు నాదెండ్ల మనోహర్ చెప్పారు. వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల్సిందిగా ఆయన మంత్రికి సూచించారు. ఆ సూచనను పట్టించుకోకుండా వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, ఇతరులు వస్తే దుర్భిక్షం వస్తుందని ప్రజలు నమ్ముతున్నారని మంత్రి అన్నారు. మంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల్సిందేనని తెలుగుదేశం సభ్యులు పట్టుబడుతూ సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు.
కరువుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ రఘువీరా రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మంత్రి రాష్ట్రంలో పర్యటించకుండా ఉపన్యాసాలు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. రఘువీరా రెడ్డి కరవు సహాయక చర్యలకు సంబంధించి లెక్కలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కరవుపై చర్చకు నిర్దిష్టంగా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి అనిర్దిష్టంగా ప్రసంగం చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications