లండన్ లో బెంగాల్ టెక్కీ మృతి

అతను ఏడాదిన్నరగా హైదరాబాదులోని వెరిజోన్ డాటా సర్వీసెస్ అనే బహుళ జాతి సంస్థలో పనిచేస్తున్నాడు. తన కుమారుడు జులై 6వ తేదీన లండన్ వెళ్లినట్లు కాజీ వాసిం తండ్రి కాజీ అబ్దుల్ మోక్తిబ్ చెప్పారు. లండన్ నుంచి అతను పారిస్ కు వెళ్లాల్సి ఉందని ఆయన చెప్పారు. అతను శనివారం తన తల్లితో చివరగా మాట్లాడినట్లు ఆయన అన్నారు. తాము ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో హైదరాబాద్ కార్యాలయాన్ని సంప్రదించినట్లు తెలిపారు. తమకు సోమవారం సాయంత్రం లండన్ పోలీసులు ఫోన్ చేసి తమ కుమారుడు మరణించినట్లు చెప్పినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications