కాంగ్రెస్ లో విలీనం ఉండదు: పవార్

తమ పార్టీ విలీనమయ్యే విషయాన్ని ఎన్సీపి పరిగణనలోకి తీసుకోవాలని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, కేంద్ర మంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ చేసిన ప్రకటనలపై ఆయన బుధవారం తీవ్రంగా ప్రతిస్పందించారు. అవి ప్రచారం కోసం చేసే చౌకబారు ప్రకటనలని ఆయన కొట్టి పారేశారు. అంతకన్నా తానేమీ చెప్పలేనని ఆయన అన్నారు. వారు అలా అనాల్సి ఉండింది కాదని, ప్రజాజీవనంలో ఉన్నవారు రాజకీయ నాయకులు కొన్ని విషయాలు మాట్లాడితే అర్థం చేసుకోవచ్చునని, ప్రధానమైన విషయాలను బహిరంగంగా మాట్లాడేవారు ప్రచారాన్ని ఆశిస్తున్నారని అనుకోవాల్సి ఉంటుందని, అంతకు మించి వారి ప్రకటనలకు ప్రాధాన్యం లేదని ఆయన అన్నారు.
మహారాష్ట్ర తీవ్రమైన కరవును ఎదుర్కుంటున్న సమయంలో కాంగ్రెసు, ఎన్సీపి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, ఎన్నికల్లో కాంగ్రెసు కలిసి వస్తే సంతోషమని, కలిసి రాకపోయినా ఫరవా లేదని ఆయన అన్నారు. ప్రతి రాజకీయ పార్టీ తన సొంత నిర్ణయాన్ని తీసుకోవాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications