బాబుపై ప్రసన్న మరో లేఖాస్త్రం

చంద్రబాబు నియంతృత్వ పోకడ నుంచి పార్టీని, కార్యకర్తలను కాపాడాలన్నదే తమ ఉద్దేశమని ఆయన అన్నారు. చంద్రబాబు అంతటి పచ్చి అవకాశవాది భారత రాజకీయాల్లో మరొకరు లేరని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు మారుతారేమో, తాము వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్తారేమో అని భావించామని, అయితే అందుకు విరుద్ధంగా చంద్రబాబు తమపైనే ఎదురు దాడికి దిగుతున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబును చూసి ప్రజలు ఓటేయలేదని, ఎన్టీఆర్ ను చూసి తెలుగుదేశం పార్టీకి ఓటేశారని ఆయన అన్నారు. ఓటమిని తట్టుకోలేకనే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లపై చంద్రబాబు టన్నుల కొద్ది ప్రేమ కురిపిస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications