'మోడీపై చర్యను అద్వానీ ఆపారు'

Jaswant Singh
న్యూఢిల్లీ: బిజెపి అగ్రనేత ఎల్ కె అద్వానీపై బహిష్కృత నేత జస్వంత్ సింగ్ విమర్శానాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై చర్య తీసుకోకుండా మాజీ ప్రధాని వాజ్ పేయిని అద్వానీయే ఆపారని ఆయన ఆరోపించారు. పార్టీలో ఉద్రేకాలు పెచ్చరిల్లుతాయని చెప్పి మోడీపై చర్య తీసుకోకుండా అద్వానీ ఆపారని ఆయన శనివారం ఒక టీవీ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు.

మోడీ వ్యవహారంలో అద్వానీ వైఖరిని తెలుసుకునే బాధ్యతను వాజ్ పేయి తనకు అప్పగించారని, మోడీపై చర్య తీసుకుంటే పార్టీలో ఉద్రేకాలు పెచ్చరిల్లుతాయని అద్వానీ తనతో చెప్పారని ఆయన వివరించారు. వాజ్ పేయి మానసికంగా బాధపడినప్పటికీ మోడీపై చర్య తీసుకోలేకపోయారని ఆయన అన్నారు. వాజ్ పేయి ఆ సమయంలో ప్రధాని పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డారని, అయితే తామంతా ఆ ప్రయత్నాన్ని ఆపామని ఆయన చెబుతూ తాము ఎలా ఆ ప్రయత్నాన్ని ఆపిందీ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+