మీడియా కాదు, ప్రజలు: చిరు

రాజకీయాల్లోకి వచ్చాక తన బాధ్యత పెరిగిందని ఆయన చెప్పారు. సింగిల్ టేకింగ్ అనేది రాజకీయంలో ఉండదని, సింగిల్ టేక్ రాజకీయాలు కొత్తగా ఉన్నాయని ఆయన అన్నారు. తనకు రాజకీయ జీవితం సంతృప్తి ఇచ్చిందని ఆయన చెప్పారు. పార్టీ శ్రేణులు ఉత్సహంగా ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రజా ఉద్యమమే తమ పార్టీ ఎజెండా అని ఆయన అన్నారు.
శనివారం ఉదయం జన్మ దినం సందర్భంగా చిరంజీవిని వేదపండితులు ఆశీర్వదించారు. ఇంతకు ముందు తాను సినీ ప్రముఖులు, అభిమానుల మధ్యనే జన్మదినం జరుపుకునే వాడినని, ఇప్పుడు ప్రజలందరి మధ్య నిర్వహించుకుంటున్నానని ఆయన చెప్పారు. ఇక ప్రజారాజ్యం పార్టీకి అన్నీ శుభాలే అని ఆయన అన్నారు. తన జన్మదినాన్ని అభిమానులు నిరాడంబరంగా జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ జన్మదినం తనపై మరింత బాధ్యతను పెంచిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications