అసెంబ్లీ: మజ్లీస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్

స్పీకర్ కు క్షమాపణ చెప్పాలని రోశయ్య మజ్లీస్ సభ్యులకు సూచించారు. వారు అందుకు అంగీకరించలేదు. స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ఎంత చెప్పినా వినలేదు. తాను కూర్చోవాలని దాదాపు 24 సార్లు సూచించానని, అయినా వినలేదనుి స్పీకర్ చెప్పారు. మజ్లీస్ సభ్యులు తమ పట్టు వీడకపోవడంతో వారిని ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు.
ఇందిరమ్మ ఇళ్లపై ప్రశ్నకు అవకాశం ఇవ్వాలని మజ్లీస్ సభ్యులు పట్టుబట్టారు. అందుకు స్పీకర్ నిరాకరించారు. దాంతో వారు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ ను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై వారిని స్పీకర్ ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు.












Click it and Unblock the Notifications