కాంగ్రెసుపై మజ్లీస్ గరం

MIM Congress
హైదరాబాద్: తమను సోమవారం శాసనసభ నుంచి సస్పెండ్ చేసిన సంఘటనపై మజ్లీస్ కాంగ్రెసుపై తీవ్రంగా మండిపడుతోంది. ఇందిరమ్మ ఇళ్లపై చర్చ సందర్భంగా తనపై అనుచితంగా ప్రవర్తించారంటూ స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ముగ్గురు ఎంఐఎం సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. దీనిపై మజ్లీస్ శాసనసభా పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. శాసనసభలో ఇప్పటి వరకు తనపై అనుచితంగా ప్రవర్తించినట్లు వ్యాఖ్య రాలేదని, మొదటి సారి తనపై ఈ విధమైన ఆరోపణ వచ్చిందని, దీనికి కాంగ్రెసు పార్టీయే కారణమని ఆయన అంటున్నట్లు తెలుస్తోంది.

ఇందిరమ్మ ఇళ్లపై ప్రశ్నోత్తరాల సమయంలో ఒక అనుబంధ ప్రశ్నకు అవకాశం ఇవ్వాలని తాము కోరామని, తమను సస్పెండ్ చేసిన తర్వాత గంటన్నర పాటు ఆ అంశంపైనే చర్చ జరిగిందని, తమకు అవకాశం ఇస్తే వచ్చే నష్టం ఏమిటో తమకు అర్థం కాలేదని ఆయన అంటున్నట్లు తెలుస్తోంది. సస్పెండ్ అయిన తర్వాత ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క అక్బరుద్దీన్ ను కలిశారు. ఆయన సర్దిచెప్పినా అక్బరుద్దీన్ వినలేదని సమాచారం. వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 150 డివిజన్లలో పోటీ చేసి కాంగ్రెసును ఓడిస్తామని ఆయన హెచ్చరినట్లు తెలుస్తోంది.

కాంగ్రెసును ఓడించడానికి అవసరమైతే ప్రజారాజ్యం, తెలంగాణ రాష్ట్ర సమితి వంటి పార్టీలతో జత కట్టి మూడో ప్రత్యామ్యాయాన్ని ఏర్పాటు చేస్తామని కూడా ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. తాము కాంగ్రెసుకు ఎప్పటికప్పుడు సహకరిస్తూ వస్తుంటే తమపై వ్యవహరించే తీరు ఇదేనా అని ఆయన అడిగినట్లు తెలుస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మజ్లీస్ ముఖ్యమంత్రి డాక్ట్ర వైయస్ రాజశేఖర రెడ్డికి బాసటగా నిలిచిన విషయం తెలిసిందే. మజ్లీస్ కాంగ్రెసుకు దూరమైతే ఆ విషయంలోనే కాకుండా వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+