న్యూఢిల్లీ: మిస్ యూనివర్స్ 2009 కిరీటం మిస్ వెనిజులాకు దక్కింది. 84 మందిని తోసిరాజని మిస్ వెనిజులా స్టెఫానియా ఫెర్నాండెజ్ ఈ కిరీటం దక్కించుకుంది. నిరుడు కూడా మిస్ వెనిజులాకే ఈ కిరీటం దక్కింది. నిరుడు వెనిజులాకు చెందిన డయానా మెండోజా ఈ కిరీటం దక్కించుకుంది. పుయెర్టో రికో, డొమినికన్ రిపబ్లిక్, కొసోవా, ఆస్ట్రేలియా, వెనిజులా సుందరులు ఫైనల్ కు చేరుకున్నారు.
చివరకు మిస్ వెనిజులా విశ్వసుందరి కిరీటాన్ని ఎగురేసుకు పోయింది. భారత కాలమానం ప్రకారం మిస్ యూనివర్స్ 2009 పోటీలు సోమవారం ఉదయం జరిగాయి. పైనల్ కు ముగ్గురు లాటిన్ అమెరికా సుందరులు చేరుకోవడం విశేషం.