71కి చేరిన స్వైన్ ఫ్లూ మృతులు

కమల్ బాలా సాహెబ్ వాగ్లే అనే 42 వ్యక్తి భారతి ఆస్పత్రిలో మరణించాడు. తాయ్ ఆరుణ్ బాగల్ అనే బాలిక కమాండ్ ఆస్పత్రిలో మరణించింది. వడొదరాలో మూడో మరణం సంభవించింది. బరూచాకు చెందిన హస్ముఖ్ హింగూ మరణం సంభవించింది. గుజరాత్ లో ఇది ఆరో స్వైన్ ఫ్లూ మరణం.
కాగా, వారం రోజులుగా పూణేలో మూతపడిన పాఠశాలలు సోమవారం తిరిగి తెరుచుకున్నాయి. వివిధ రాష్ట్రాల్లో సోమవారం తాజాగా వంద కేసులు నమోదయ్యాయి. పూణేలో స్వైన్ ఫ్లూ వల్ల మరణించినవారి సంఖ్య 23కు చేరుకుంది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు వాటితో కలుపుకుని 39 మంది మృత్యువాత పడ్డారు.












Click it and Unblock the Notifications