బాబుకు కడుపు మంట: వైయస్

అక్రమాలు ఏవైనా ఉంటే నిర్దిష్టంగా తమ దృష్టికి తెస్తే చర్యలు తీసుకంటామని ముఖ్యమంత్రి అంతకు ముందు హామీ ఇచ్చారు. అయితే సభా సంఘం వేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి తీవ్రంగా ప్రతిస్పందించారు. తాము సాగునీటి ప్రాజెక్టులు కడతామంటే ప్రతిపక్షాలు కోర్టుకెక్కాయని ఆయన అన్నారు. ఇందిరా ఆవాస్ యోజన కింద 11 లక్షల ఇళ్లు కట్టామని, 45 లక్షల ఇళ్లు కట్టి వాటిలో 11 లక్షలు ఆవాస్ యోజన కింద చూపిస్తే తప్పేమిటని ఆయన అన్నారు. తెలుగుదేశం తన ప్రభుత్వ హయాంలో ఆ పథకాన్ని రాజకీయానికి వాడుకుందని ఆయన విమర్శించారు. ఉపాధి హామీ పథకం కింద నిధులు దుర్వినియోగం అవుతున్నాయని గతంలో తెలుగుదేశం పార్టీ కేంద్రానికి ఫిర్యాదు చేసిందని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications