నెలలో మంత్రివర్గ విస్తరణ: వైయస్

స్థానిక సంస్థల్లో కాంగ్రెసు పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మంత్రులదేనని, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ఆధారపడి మంత్రుల పనితీరును బేరీజు వేస్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విఫలమైతే మంత్రులపై వేటు తప్పదని ఆయన అన్నారు. మంత్రులు నిర్లక్షం వహిస్తే సహించేది లేదని ఆయన అన్నారు. అక్టోబర్ తర్వాతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలుంటాయని, రంజాన్ పర్వదినం తర్వాత నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మజ్లీస్ తమతోనే ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రైతుల రుణమాఫీ గడువును పెంచాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications