బిజెపి కటీ పతంగ్: శౌరీ

రాను రాను పార్టీ ప్రైవేట్ కంపెనీలాగా మారిపోతోందని ఆయన అన్నారు. పార్టీ నాయకత్వాన్ని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల నుంచి నాయకత్వాన్ని స్వీకరించాలని ఆయన సూచించారు. ఒకరిద్దరిని పార్టీ నుంచి బహిష్కరించడం వల్ల లాభం లేదని, మొత్తం నాయకత్వాన్నే మార్చాలని ఆయన అన్నారు.
ఈ వ్యాఖ్యలకు గాను అరుణ్ శౌరీపై బిజెపి అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూఢీ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. అరుణ్ శౌరీ అమరుడిని కావాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. కాగా, అరుణ్ శౌరీపై కూడా బిజెపి నాయకత్వం వేటు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications