న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు అరుణ్ శౌరీ వ్యవహారం భారతీయ జనతా పార్టీ (బిజెపి) అంతర్గత వ్యవహారమని ఆర్ ఎస్ ఎస్ కొట్టిపారేసింది. ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి ఆర్ ఎస్ ఎస్ నిరాకరించింది. ఈ మేరక్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) అధికార ప్రతినిధి రామ్ మాధవ్ మంగళవారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత సంక్షోభాన్ని బిజెపి తన సొంతంగానే పరిష్కరించుకుంటుందని ఆయన అన్నారు.
అరుణ్ శౌరి వ్యాఖ్యల నేపథ్యంలో బిజెపి అధ్యక్షుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో మంగళవారం సాయంత్రం భేటీ కానున్న నేపథ్యంలో ఆ ప్రకటన జారీ అయింది. అరుణ్ శౌరీపై చర్య తీసుకునేందుకు బిజెపి నాయకత్వం సమాయత్తమవుతున్నట్లు సమాచారం.