రాజ్యాంగానికి అపచారం: జెపి

Jayaprakash Narayan
హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల చట్టం సవరణ బిల్లును ప్రభుత్వం ప్రతిపాదించి రాజ్యాంగానికి అపచారం చేసిందని లోకసత్తా శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యానించారు. శాసనసభ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రిజిస్ట్రేషన్ల చట్టాన్ని మార్చే హక్కు శాసనసభకే కాదు, పార్లమెంటుకు కూడా లేదని ఆయన అన్నారు. రిజిస్ట్రేషన్ల చట్టం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల కింద సంఘాన్ని పెట్టుకునే హక్కును కల్పిస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తాను చెబుతున్నా వినకుండా మొండిగా బిల్లును ప్రతిపాదించిందని ఆయన అన్నారు. రాజ్యాంగంలోని నిబంధనలను ఆయన చదివి వినిపించారు.

రాజ్యాంగాన్ని కాపాడాల్సినవారే రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా వ్యవహరించడాన్ని తాను సభలో చూడలేకపోయానని ఆయన అన్నారు. ప్రభుత్వం తెలియక ఈ పనికి ఒడిగట్టిందని, భేషిజాలకు పోతోందని, ఈ బిల్లు ప్రవేశపెట్టడంలో ప్రభుత్వానికి దురుద్దేశం ఉందని కూడా తాను అనడం లేదని, రాజ్యాంగాన్ని కాపాడడానికే తాను శాసనసభకు వచ్చానని, అటువంటిది తన కళ్ల ముందే రాజ్యాంగానికి విఘాతం కలుగుతుంటే చూడలేకపోయానని ఆయన అన్నారు. ఈ బిల్లును వ్యతిరేకించడం వల్ల తనకు ఏ విధమైన ప్రయోజనం లేదని, రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశం మాత్రమే తనకు ఉందని ఆయన అన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కోర్టుకు వెళ్లవచ్చునని మంత్రి చెబుతున్నారని, గోటితో పోయేదానికి గొడ్డలి ఎందుకనేది తన ప్రశ్న అని ఆయన అన్నారు. ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం ఆ బిల్లును సభలో ప్రవేశపెట్టిందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+