చిరుకు అవగాహన లేదు: బాబు

ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిదానికీ ఎగతాళి చేస్తోందని ఆయన అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. మరో ప్రభుత్వమైతే ఇప్పటకే టిటిడి పాలక మండలిని రద్దు చేసి ఉండేదని ఆయన అన్నారు. తమ పార్టీ సభ్యుడు టీవీ రామారావు అంశంపై పెద్ద యెత్తున గందరగోళానికి దారి తీయించి ప్రభుత్వం టిటిడిపై చర్చను శాసనసభలో వాయిదా పడేలా చూసిందని ఆయన వ్యాఖ్యానించారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మొద్దు ఎద్దులా పడుకుందని, ప్రజలే దాన్ని లేపాలని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ చెప్పినట్లు వింటేనే సభ సజావుగా జరుగుతుందని, లేదంటే సభను వాయిదా వేయించుకుని వెళ్లిపోతారని ఆయన అన్నారు. ప్రజాసమస్యలు చర్చకు రాగానే సభ వాయిదాకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications