చంద్రబాబు నిర్వాకమే: చిరు

శ్రీవారి నగల కుంభకోణంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పాత్ర ఉందని, అందుకే ఆ వ్యవహారంపై శాసనసభలో చర్చకు రాకుండా రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయని ఆయన విమర్శించారు. ఆ అంశంపై చర్చ జరగకుండా సభా సమయాన్ని వృధా చేస్తున్నాయని ఆయన అన్నారు. తిరుమల అక్రమాలను ప్రజాకోర్టులో వెల్లడిస్తామని ఆయన అన్నారు. కెజి బేసిన్ లో రాష్ట్ర వాటా సాధించేందుకు తమ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన చెప్పారు. గ్యాస్ పై తాము తలపెట్టిన ఉద్యమం ఆగదని ఆయన చెప్పారు. కెజి బేసిన్ లో గ్యాస్ నిక్షేపాలు బయట పడడం మన అదృష్టమని ఆయన అన్నారు. ప్రభుత్వం గ్యాస్ కార్పోరేషన్ ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని ఆయన అన్నారు.
కాకినాడ రైల్వే స్టేషనులో చిరంజీవికి ఘనస్వాగతం లభించింది. చిరంజీవిని చూడడానికి పెద్ద యెత్తున అభిమానులు తరలి వచ్చారు. దీంతో రైల్వే స్టేషనులో తోపులాట చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications