కాంగ్రెస్ గూటికి రోజా

కాగా, తాను ముఖ్యమంత్రిని అభినందించడానికి మాత్రమే వచ్చానని రోజా అన్నారు. కానీ రోజా త్వరలోనే కాంగ్రెసు పార్టీలో చేరుతారని కాంగ్రెసు వర్గాలు అంటున్నాయి. ముఖ్యమంత్రితో సమావేశం సందర్భంగా రోజా రాజకీయ భవిష్యత్తు గురించి, ఇతర అంశాల గురించి చర్చ జరిగినట్లు చెబుతున్నారు. తాను తెలుగుదేశం పార్టీలో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కుంటున్నానని, అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నానని రోజా చెప్పారు.
రోజాను కాంగ్రెసులో చేర్చుకోవడానికి మంత్రి గల్లా అరుణకుమారి తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే ముఖ్యమంత్రి అరుణకుమారికి నచ్చజెప్పినట్లు సమాచారం. చంద్రగిరి నియోజకవర్గంలో అరుణ కుమారిపై రోజా పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలో అరుణకుమారిపై రోజా పదునైన వ్యాఖ్యలు కూడా చేశారు.












Click it and Unblock the Notifications