ఇంకా దొరకని వైయస్ ఆచూకీ

రా బలగాలు కూడా రంగంలోకి దిగాయి. కేంద్ర, రాష్ట్ర బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వైమానిక దళాలకు చెందిన హెలికాప్టర్లు కూడా గాలింపు చర్యలకు దిగాయి. భారత ప్రభుత్వం అమెరికా సహాయాన్ని కూడా కోరినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి కేంద్ర మంత్రులు ఎస్ జైపాల్ రెడ్డి, వీరప్ప మొయిలీ, పృథ్వీరాజ్ చవాన్ హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్ర మంత్రులు కర్నూలు జిల్లా అత్మకూరును కేంద్రంగా చేసుకుని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల్లో గాలింపు కొనసాగుతోంది. నల్లమల అడవిని జల్లెడ పడుతున్నారు. చెంచులు కూడా రంగంలోకి దిగారు.
మాస్కోలో ఉన్న రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ బుధవారం ముఖ్యమంత్రి పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, తదితరులు ప్రధానితో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.












Click it and Unblock the Notifications