సిఎం రేసులో లేను: రోశయ్య

కాంగ్రెసు పార్టీ అధిష్టానవర్గం ఆదేశాల మేరకే తాను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశానని,ఇది తన శక్తికి మించిన పని అని ఆయన అన్నారు.కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు తాను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఆయన చెప్పారు. బరువైన గుండెతో తాను ప్రమాణం స్వీకారం చేశానని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే, సంతాపదినాలు ముగిసిన తర్వాతనే కొత్త ముఖ్యమంత్రి ఎంపిక జరుగుతుందని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ న్యూఢిల్లీలో చెప్పారు.












Click it and Unblock the Notifications