ముఖ్యమంత్రిగా జైపాల్ రెడ్డి?

తెలంగాణ నాయకుడిని ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెసు అధిష్ఠానవర్గం ప్రతిపాదిస్తే రాయలసీమ, కోస్తా నాయకులు అంగీకరించే పరిస్థితి లేదు. అలాగే రాయలసీమలో గానీ, కోస్తాలో గానీ ముఖ్యమంత్రి పదవి చేపట్టే స్థాయి ఉన్న నాయకుడు మరొకరు కనిపించడం లేదు. ప్రస్తుత శాసనసభ్యుల నుంచి గానీ, ఇతర నాయకులను గానీ ఆ పదవికి సూచిస్తే శాసనసభ్యులు నిలువునా చీలినా ఆశ్చర్యం లేదు. అయితే జైపాల్ రెడ్డి తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవారే అయినా ఆయనపై ఈ ముద్ర ఉండదు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా, వివాదాలకు దూరంగా ఉండే సీనియర్ నేతగా జైపాల్ రెడ్డికి మంచి పేరుంది. ఆయనను ముఖ్యమంత్రి పదవిని అప్పగిస్తే ఎవరి నుంచి కూడా వ్యతిరేకత ఎదురయ్యే పరిస్థితి ఉండదు. రోశయ్యను అన్ని వర్గాల వారు అంగీకరించ వాతావరణం లేదు.












Click it and Unblock the Notifications