సాక్షికి వైయస్ చివరి ఇంటర్వ్యూ

తాను ఎవరికీ చెప్పకుండా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తానని, ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తానని ఆయన చెప్పారు. తాను ఏ గ్రామానికి వస్తానో ముందే చెబితే అక్కడి అధికారులు జాగ్రత్త పడి లోపాలు సరిదిద్దుతారని, అందువల్ల పర్యటన రోజు ఉదయం మాత్రమే తాను ఏ గ్రామానికి వెళ్లేది తెలియజేస్తానని ఆయన చెప్పారు. గ్రామాల్లో ప్రజలతో నేరుగా సమావేశమవుతానని ఆయన చెప్పారు. గ్రామాల్లో సరఫరా వ్యవస్థలు సరిగా పని చేస్తున్నాయా లేదా స్వయంగా చూస్తానని ఆయన చెప్పారు. కరవు సమస్యలపై కూడా వాకబు చేస్తానని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 20 వేల గ్రామాల్లో పర్యటించడం సాధ్యం కాదు కాబట్టి నెలకు రెండు మూడు రోజులు మూడు నాలుగు గ్రామాలకు వెళ్తానని, దీనివల్ల గ్రామాల్లో సమస్యలేమిటనేవి తెలుస్తాయని, వాటిని సరిదిద్దడానికి తగిన చర్యలు తీసుకోవడానికి వీలు అవుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications