జగన్ సిఎం అయినా సరే: రోశయ్య

ఇదిలా ఉంటే, తాను ముఖ్యమంత్రి పదవికి రేసులో లేనని మాజీ మంత్రి, కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ, ఆయనకు మద్దతుగా తయారు చేసిన వినతిపత్రంపై సంతకం చేయాలని తనను ఎవరూ కోరలేదని ఆయన చెప్పారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ గవర్నర్ కు జాబితా సమర్పించడానికి వైయస్ అనుచరులు వంద మంది శాసనసభ్యుల సంతకాలు సేకరించారు.












Click it and Unblock the Notifications