జాడ తెలిపిన వెస్లీ ఎస్ఎంఎస్

బుధవారం మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాలకు జాన్ వెస్లీ సెల్ నుంచి ఎస్ఎంఎస్ వచ్చినట్లు తెలుస్తోంది. అప్పటికి హెలికాప్టర్ అదృశ్యమై రెండున్నర గంటలవుతోంది. ఎస్ఎంఎస్ సర్వీస్ ప్రొవైడర్ కంటెంట్ ను అధికారులు వెల్లడించడానికి నిరాకరిస్తున్నారు. అయితే చివరి సిగ్నల్ మాత్రం ఆ సెల్ నుంచి వచ్చినట్లు చెప్పారు. ఆ ఎస్ఎంఎస్ ఆధారంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విశ్లేషించి నాలుగు కిలోమీటర్ల పరిధిలో గాలింపు జరిపారు. దాంతో హెలికాప్టర్ కూలిన ప్రదేశం దొరికింది. దాని ఆధారంగ హకీంపేట హెలికాప్టర్ శిక్షణా పాఠశాలకు చెందిన రెండు హెలికాప్టర్లలో ఒకటి ఆరున్నరకే ఆ ప్రదేశంలో దిగింది. రెండు గంటల గాలింపు తర్వాత ఉదయం ఎనిమిదిన్నరకు కూలిన హెలికాప్టర్ శకలాలు కనిపించాయి.












Click it and Unblock the Notifications