కర్నూలు: సిఎం హెలికాప్టర్ ప్రమాద సంఘటపై కర్నూలు జిల్లా ఆత్మకూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 132-2009 క్రైం నంబర్‌లో 174 సెక్షన్ ప్రకారం ఎయిర్‌క్రాష్ కింద కేసు నమోదు చేశామని సిఐ శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా సిఎం మృతి చెందిన సంఘటన స్థలాన్ని శుక్రవారం సిఐడి బృందం పరిశీలించింది. అనంతరం ఆత్మకూరు స్పెషల్ పార్టీ పోలీసులు సైతం సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసుకు అవసరమైన శకలాలను తీసుకొని వెళ్ళారు.