కడప: ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కాంక్షిస్తూ శనివారం పులివెందులలోని ఆడిటోరియంలో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. రాజశేఖర్ రెడ్డి స్వగృహ సమీపంలోని ఆడిటోరియంలో ఈ ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ ప్రార్థనలలో వైఎస్ కుటుంబ సభ్యులతోపాటు, రాజశేఖర్‌రెడ్డి మిత్రుడు, అత్యంత సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు, ప్రముఖులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.