అసెంబ్లీకి జగన్, నిర్ణయం వెనుక- కీలక మంత్రాంగం..!!

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశ గా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కూటమి- వైసీపీ కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి నిర్ణయాలు తీసుకుంటున్న వేళ... ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ జగన్ తన వ్యూహాలను సిద్దం చేస్తున్నారు. ఇదే సమయంలో ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు దాదాపు ముహూర్తం ఖరారైంది. ఈ సమావేశాలకు జగన్ హాజరు కానున్నారని సమాచారం.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి నిర్వహించేందుకు ప్రభుత్వం ముహూర్తం దాదాపు ఖరారు చేసింది. 2024 ఎన్నికల్లో 11 సీట్లే రావటంతో జగన్ కు ప్రతిపక్ష నేత హోదా దక్కలేదు. సభలో మిగిలిన మూడు పార్టీలు అధికారంలో ఉండటంతో.. ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఉన్న తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ డిమాండ్ చేసారు. కోర్టును ఆశ్రయించారు. కాగా, వైసీపీ గెలిచిన 11 సీట్లతో ఆ హోదా సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇదే సమయంలో సభకు హాజరు కాకుండా వైసీపీ ఎమ్మెల్యేలకు జీతాల అంశం పైనా చర్చ జరిగింది. జగన్ ఒక్కరే జీతం తీసుకోవటం లేదని స్పీకర్ వెల్లడించారు. గవర్నర్ ప్రసంగాలకు మినహా జగన్ ఇప్పటి వరకు సమావేశాలకు హాజరు కాలేదు.

 రాజధాని అమరావతి పరిధి పెంపు, ఆ ప్రాంతాలతో కలిపి మెగా సిటీగా..!!
రాజధాని అమరావతి పరిధి పెంపు, ఆ ప్రాంతాలతో కలిపి మెగా సిటీగా..!!
ap-govt-moves-to-start-the-monsoon-session-of-the-state-legislative-assembly-around-august-17-here

అసెంబ్లీ వేదికగా కీలక అంశాల పై చర్చ

కాగా, ఈ సారి సమావేశాలకు మాజీ సీఎం జగన్ హాజరు అవుతారని పార్టీ నేతల సమాచారం. ఈ సారి సమావేశాల్లో ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం బిల్లును ప్రవేశ పెట్టనుంది. అదే విధంగా ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న కీలక పరిణామాల పైన నిలదీసేందుకు సభకు వెళ్లాలని తాజాగా వైసీపీ ముఖ్య నేతలతో జరిగిన భేటీలో జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. లా అండ్ ఆర్డర్, సాయిక్రిష్ణ లాకప్ డెత్, రైతుల సమస్యలు, ఎన్నికల హామీలు, సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితి పైన ప్రస్తావన చేద్దామని చెప్పినట్లు సమాచారం. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుంటే నిరసన వ్యక్తి చేసి బయటకు రావాలని.. దీని ద్వారా సభకు హాజరు కావటం లేదనే చర్చకు సమాధానంగా నిలుస్తుందని పార్టీ నేతలు తాజా భేటీ లో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో.. అసెంబ్లీ సమావేశాల పై ప్రభుత్వ నిర్ణయం.. జగన్ హాజరు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+