సిఎం ఎంపికలో రెడ్డి ఫ్యాక్టర్

కాంగ్రెసు శాసనసభ్యుల్లో రెడ్ల సంఖ్య తక్కువేమీ కాదు. ఈ స్థితిలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలనే ప్రచారం ఊపందుకుంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవడానికి ఆయన మాత్రమే సరిపోతారనే భావన బలంగానే ఉంది. వైయస్ రాజశేఖర రెడ్డి బిసి, ఎస్సీ నాయకుల మద్దతును కూడగట్టుకున్నారు. అందువల్ల ప్రస్తుతం శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ వర్గాలకు చెందిన చాలా మంది వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు నిలుస్తున్నారు. అందువల్ల కేంద్ర మంత్రి పురంధేశ్వరిని ముఖ్యమంత్రిని చేసే అవకాశాలు చాలా తక్కువగానే ఉంటాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications