సిఎంగా రోశయ్య కొనసాగింపు?

త్వరలో మూడు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను సాకుగా చూపి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) నేత ఎంపికను వాయిదా వేయాలని కాంగ్రెసు హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. జగన్ ముఖ్యమంత్రిని చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా అధిష్ఠానవర్గం సీరియస్ గానే ఆలోచిస్తోంది. ఇప్పటికిప్పుడు పరిస్థితిని చక్కదిద్దే చర్యలను కాకుండా దీర్ష కాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కొత్త నేతను ఎంపిక చేయాలనేది కాంగ్రెసు అధిష్ఠానవర్గం ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.
పాలనా యంత్రాంగ నిర్వహణ అనేది అంత పెద్ద విషయమేమీ కాదని, నమ్మకమైన కొంత మంది అధికారులను ఎంపిక చేసుకుంటే వారే నడిపిస్తారని, పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని, అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకుని నేతను ఎంపిక చేయాలని అనుకుంటోంది. ప్రజాకర్షణ, రాష్ట్రాన్ని చుట్టిముట్టే సత్తా ఉన్న నేతను ఎంపిక చేయాలనేది పార్టీ అధిష్ఠానవర్గం యోచిస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనుచర గణం ఉండడం కూడా అవసరమని భావిస్తోంది. ఈ స్థితిలో సమయం తీసుకుని జగన్ ను ముఖ్యమంత్రిని చేసే విషయమై పార్టీ అధిష్ఠావర్గం సీరియస్ గానే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో వివాదాలకు దూరంగా ఉండే, తమ మాట వినే రోశయ్యను కొన్ని నెలల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగించడమే మంచిదని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications