భర్తను చంపిన ఇద్దరు భార్యలు

శంకరయ్య అనే వ్యక్తి వరంగల్ జిల్లా దుగ్యాల గ్రామానికి చెందిన పుష్పను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు పిల్లలు కలగడం లేదని ఆ తర్వాత ఆమె సోదరి సుజాతను వివాహం చేసుకున్నాడు. తొలి భార్యకు ఒక కొడుకు పుట్టాడు. రెండో భార్యకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు పుట్టారు. కొంత కాలం క్రితం గొడవలతో భార్యలను వారి పుట్టింటికి పంపించాడు. ఐదు రోజులుగా తిరిగి రావాలని శంకరయ్య వారికి ఫోన్ లు చేశాడు. దీంతో ఒక పథకం వేసుకుని వారు పెద్దంపేటకు వచ్చారు. శంకరయ్య భోజనం చేసి చేతులు కడుక్కోవడానికి బయటకు రాగానే నలుగురు వ్యక్తులు దాడి చేసి హత్య చేశారు. సింగరేణిలో పనిచేస్తున్న శంకరయ్యకు 40 లక్షల రూపాయలు వస్తున్నాయని, వాటి కోసమే భార్యలు హత్య చేయించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications