హైదరాబాద్: హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన పైలట్ భాటియా కుటుంబాన్ని దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఆయన భాటియా నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డితో పాటు పైలట్ భాటియా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.
వైయస్ జగన్ కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం ఇడుపులపాయ నుంచి హైదరాబాదుకు వచ్చారు. ఇడుపులపాయలో వైయస్ ఆంత్యక్రియలు ముగిసిన అనంతరం వారు ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ వచ్చిన వెంటనే జగన్ భాటియా ఇంటికి వెళ్లారు.