జగన్ లొల్లిపై హైకమాండ్ సీరియస్

YS Jagan
న్యూఢిల్లీ: వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని వస్తున్న డిమాండ్ పై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠాన వర్గం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒత్తిడి ద్వారా ముఖ్యమంత్రి పదవిని సంపాదించుకోవాలనే ఎత్తుగడ జగన్ కు ఎదురు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈసారి ఒత్తిడికి తలొగ్గితే అన్ని రాష్ట్రాల నుంచి, అందరివైపు నుంచి ఇదే రకమైన చర్యలు మొదలవుతాయని పార్టీ అధిష్టానవర్గం భావించి, జగన్ ను ఏదో విధంగా ముఖ్యమంత్రి పదవికి దూరంగా ఉంచాలనే ఆలోచన చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెసు లెజిస్టేచర్ పార్టీ (సిఎల్పీ) నేతను ఎంపిక చేసేందుకు ప్రణబ్ ముఖర్జీ, వీరప్పమొయిలీ, దిగ్విజయ్ సింగ్ లతో పార్టీ అధిష్టానవర్గం ఒక కమిటీ వేసినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే అటువంటి కమిటీ ఏమీ లేదని కాంగ్రెసు కాంగ్రెసు నేత అభిషేక్ సింఘ్వీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలను వీరప్ప మొయిలీ, దిగ్విజయ్ సింగ్ చూస్తారని, అవసరమైతే ప్రణబ్ ముఖర్జీ జోక్యం చేసుకుంటారని ఆయన చెప్పారు.

సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ చేసిన వ్యాఖ్యలు జగన్ కు అంత అనుకూలంగా కనిపించడం లేదు. తమపై ఎవరూ ఒత్తిడి చేయలేరని, ఇది కాంగ్రెసు పార్టీ అని ఆయన అన్నారు. సిఎల్పీ నాయకుడి ఎంపికలో అనుభవం, ఆమోదయోగ్యం, స్థిరత్వాలకే ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ అధిష్ఠాన వర్గం ఆలోచిస్తోంది. ధిక్కార స్వరాలను సహించబోమని స్పష్టం చేసింది. ఈ స్థితిలో జగన్ అనుకూల, వ్యతిరేక వర్గాలు ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి ఎంపిక వ్యవహారం ఢిల్లీకి మారింది. వయస్సు, అనుభవ లేమి జగన్ కు అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. జగన్, కెవిపి రామచంద్రరావు అంగీకరించే నాయకుడిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టే అవకాశాలున్నాయి. పార్లమెంటు సభ్యుడిని ముఖ్యమంత్రిగా చేయబోమని కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్య జగన్ కు అనుకూలంగా అధిష్టానవర్గం ఆలోచించడం లేదనే అభిప్రాయానికి బలం చేకూరుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+