జగన్ కు డిఎస్ కుమారుడి మద్దతు

YS Jaganmohan Reddy
నిజామాబాద్: ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి వైయస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని అర్హతలున్నాయని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తనయుడు సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి వైయస్ జగన్ కు అనుభవం లేదనే వ్యాఖ్యలో అర్థం లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల వద్ద అన్నారు. జగన్ కన్నా తక్కువ వయస్సులోనే వైయస్ రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యారని ఆయన గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి పదవి వైయస్ జగన్ కు అప్పగించాలని వస్తున్న డిమాండ్ కు వ్యతిరేకంగా డి. శ్రీనివాస్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిని పార్టీ అధిష్ఠాన వర్గం నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. దీంతో వైయస్ అనుచరుల నుంచి గాంధీభవన్ లో జరిగిన వైయస్ సంతాప సభలో డిఎస్ తీవ్ర వ్యతిరేకతను చవి చూడాల్సి వచ్చింది. ఆయనను సభలో మాట్లాడనీయలేదు. దానికి తోడు డిఎస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+