'సత్యం' రాజుకు గుండెనొప్పి

రామలింగరాజు ఛాతీలో నొప్పిగా ఉందని సాయంత్రం 4 గంటలకు చెప్పారని, వెంటనే జైలు వైద్యుడు పరీక్షించారని, వెంటనే ఆస్పత్రికి తరలించాలని జైలు వైద్యుడు చెప్పాడని, దాంతో నిమ్స్ కు తరలించామని జైలు సూపరింటిండెంట్ ఎం చంద్రశేఖర్ చెప్పారు. మరో రెండు రోజులు రామలింగరాజుకు చికిత్స అందించే అవకాశం ఉంది. ఆయన గత కొద్ది రోజులుగా హెపిటైటిస్ - సితో బాధపడుతున్నట్లు సమాచారం. సాధారణంగా ఖైదీలను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తారు. అయితే ప్రైవేట్ గా వైద్యానికి ఖర్చు భరించే శక్తిగలవారిని నిమ్స్ కు తరలిస్తారు.












Click it and Unblock the Notifications