దాడిలో భారత సంతతి వ్యక్తి మృతి

Ekram Haque-Marian
లండన్: జాతి వివక్ష దాడికి గురైన 67 ఏళ్ల వ్యక్తి లండన్ ఆస్పత్రిలో మరణించాడు. పాఠశాల విద్యార్థులు నిర్దయగా సోమవారం అతనిపై దాడి చేశారు. ఇది జాతి వివక్ష దాడి అని పోలీసులు చెప్పారు. తీవ్రంగా గాయపడిన కోల్ కత్తాలో పుట్టిన ఎక్రం ఉల్ హక్ అనే వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

హక్ పై దాడి చేసిన ముగ్గురు టీనేజ్ పిల్లలపై కేసు పెట్టారు. ఆసియా ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో హక్ పై దాడి జరిగింది. దాడి నుంచి ా వ్యక్తి మనవరాలు మారియన్ బయట పడింది. ఆమె సంఘటన పూర్వపరాలు వివరించింది. ఈ సంఘటన ఆగస్టు 31వ తేదీన జరిగింది. ఈ కేసును జాతి వివక్ష దాడిగా పరిగణించి విచారణ చేస్తున్నట్లు స్కాట్ లాండ్ యార్డు తెలిపింది. హక్ తన భార్యతో కలిసి 1972లో నార్తర్న్ ఐర్ లాండ్ రాజధాని బెల్ ఫాస్ట్ కు వచ్చాడు. అతను చేనేత పరిశ్రమలో తొలుత పని చేశాడు. ఆ తర్వాత వికలాంగుల హోం వార్డెన్ గా పనిచేశాడు. హక్ కు 35 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+