జగన్: సోనియాతో మొయిలీ భేటీ

జగన్ ను ముఖ్యమంత్రిని తాము పార్టీ అధిష్ఠానవర్గంపై ఒత్తిడి తేవడం లేదని, అధిష్ఠాన వర్గం నిర్ణయాన్ని శిరసా వహిస్తామని రాష్ట్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు అంటున్నారు. తాము ప్రజాభిప్రాయాన్ని మాత్రమే అధిష్ఠానవర్గానికి వినిపిస్తున్నట్లు కాంగ్రెసు రాష్ట్ర ఎంపీల కన్నీనర్ పొన్నం ప్రభాకర్ అన్నారు. తమది పార్టీ అధిష్ఠానవర్గంపై ఒత్తిడి తెచ్చే పార్టీ కాదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తాము పార్టీ అధిష్ఠానవర్గంపై ఒత్తిడి తేవడం లేదని వైయస్ సోదరుడు వైయస్ వివేకానందరెడ్డి అన్నారు. ప్రజల కోరిక మేరకు జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తారనే నమ్మకం తమకు ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications