ఎవరినీ పిలిపించలేదు: మొయిలీ

Veerappa Moily
న్యూఢిల్లీ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు తాము ఎవరినీ ఢిల్లీకి ఆహ్వానించలేదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయ మిత్రుడు కెవిపి రామచందర్ రావును ఢిల్లీకి పిలిపించినట్లు వచ్చిన వార్తలపై ఆయన ఆ విధంగా స్పందించారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి గంట సేపు చర్చలు జరిపిన అనంతరం మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైయస్ రాజశేఖర రెడ్డి సంతాప దినాలు ముగిసేంత వరకు కొత్త నేత ఎంపికపై దృష్టి సారించబోమని ఆయన ఢిల్లీలో అన్నారు. తాము కొత్త నేత ఎంపికపై ఏ విధమైన కసరత్తు చేయడం లేదని ఆయన చెప్పారు.

కొత్త నేతను ఎన్నుకునే వరకు తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తానని కె. రోశయ్య చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతికి సంతాపం ప్రకటించేందుకు శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు ఆయన తెలిపారు. రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపై సిఐడి ప్రాథమిక నివేదిక ఇంకా రాలేదని ఆయన హైదరాబాదులో మీడియా ప్రతినిధలతో చెప్పారు. ముఖ్యమంత్రిగా రోశయ్య సోమవారం నుంచి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం స్వైన్ ఫ్లూపై సమీక్ష చేశారు. మంగళవారం రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+