వైయస్ ప్రమాదం: భాటియా తప్పిదం?

భాటియా ఆపరేటింగ్ లిమిట్స్ ను దాటిన సందర్భాలు చాలా ఉన్నాయని అంటున్నారు. ఒత్తిళ్లను తట్టుకునే మాక్ రోటర్, ఆర్పీఎం వినియోగాన్ని గరిష్ట స్థాయికి భాటియా తీసికెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. తనకు డిజిసిఎ నుంచి వివరణ ఇవ్వాలని ఎప్పుడు కూడా నోటీసులు రాలేదని బాటియా గట్టిగా వాదించినట్లు చెబుతున్నారు. భాటియా లైసెన్స్ జూన్ 3వ తేదీతోనే ముగిసిందని, అటువంటప్పుడు రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ను నడపడానికి భాటియాను ఎందుకు అనుమతించారని కూడా అంటున్నారు. ముఖ్యమంత్రిగా ఎంఎస్ రెడ్డిని, శివకుమార్ లను పైలట్లుగా జూన్ 4వ తేదీ నుంచి నియమించినట్లు చెబుతున్నారు. అటువంటి సమయంలో భాటియా ఎందుకు హెలికాప్టర్ ను నడపాల్సి వచ్చిందనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది.












Click it and Unblock the Notifications