వైయస్ చాపర్ పనికి మాలిందే

సెప్టెంబర్ 3వ తేదీ వెబ్ సైట్ పోస్టింగ్ లో ఆ హెలికాప్టర్ వాలిడిటీ 2006 జులై 5 నుంచి 2007 జులై 4వ తేదీ వరకు మాత్రమే ఉన్నట్లు ఉంది. వాలిడిటీ సర్టిఫికెట్ ను 1999 జనవరి 14వ తేదీన ఇచ్చినట్లు తాజా పోస్టింగులో తెలిపింది. సెప్టెంబర్ 3వ తేదీ పోస్టింగులో మాత్రం దాన్ని 2006 జులై 6వ తేదీన ఇచ్చినట్లు ఉంది. వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ అదృశ్యమైన రోజు సెప్టెంబర్ 2వ తేదీన డిజిసిఎ హెలికాప్టర్ ప్రయాణానికి పనికి వచ్చేదేనని ప్రకటించింది. పరస్పర విరుద్దమైన పోస్టింగులపై మాట్లాడడానికి డిజిసిఎ నిరాకరిస్తోంది. మీడియాతో మాట్లాడేందుకు తమకు అనుమతి లేదని జాయింట్ డైరెక్టర్ జనరల్ (దర్యాప్తు) ఎకె చోప్రా అంటున్నారు.












Click it and Unblock the Notifications