రెండు రోజుల్లో రాష్ట్ర నేత: సోనియా

పార్టీ శాసనసభ్యులు, ఎంపిల అభిప్రాయాలే కాకుండా పార్టీ కార్యకర్తల అభిప్రాయం కూడా తాము సోనియాకు చెప్పినట్లు తెలిపారు. వైయస్ రాజశేఖర రెడ్డి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లే నేత రాష్ట్రానికి కావాలని చెప్పినట్లు తెలిపారు. అనుభవం గురించి ప్రస్తావన రాలేదని కావూరి సాంబశివరావు చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన కార్యక్రమాలను కొనసాగించే నేత కావాలని, వైయస్ కుమారుడు అందుకు తగినవాడని తాము చెప్పామని ఆయన అన్నారు. తాము చెప్పిందంతా సోనియా విన్నారని, ఆమె ఏమీ చెప్పలేదని ఆయన అన్నారు. సోనియా గాంధీని కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి కూడా కలుసుకున్నారు.












Click it and Unblock the Notifications