జగన్ కాకుంటే పార్టీలో చీలిక?

Vivekananda Reddy
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయకపోతే కాంగ్రెసు పార్టీ చీలుతుందా. తాజాగా ఎదురవుతున్న ప్రశ్న ఇది. జగన్ ను ముఖ్యమంత్రిని చేయకపోతే పార్టీ చీలిపోతుందని కాంగ్రెసు శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి చేసిన తాజా వ్యాఖ్య చర్చనీయాంశంగా మారింది. వైయస్ కు సంతాపం తెలియజేయడానికి మైనారిటీలు ఏర్పాటు చేసిన సంతాప సభలో ఆయన ఆ మాట అన్నారు. తన మాటను మీడియా వక్రీకరించిందని ఆయన ఎన్ని చెప్పినా వైయస్ జగన్ మద్దతుదారుల తీరు అదే తరహాలో ఉండడం కనిపిస్తూనే ఉంది. కొంత మంది తాము రాజీనామా లేఖలను పట్టుకుని సిద్ధంగా ఉన్నామని, జగన్ ను సిఎం చేయకపోతే రాజీనామా చేస్తామని హెచ్చరిస్తున్నారు.

జగన్ కోసం అటు ఢిల్లీలోనూ ఇటు రాష్ట్రంలోనూ మద్దతు కూడగట్టే ప్రయత్నం పెద్ద యెత్తున జరుగుతోంది. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశం ఏర్పాటు చేస్తే అటో ఇటో తేల్చుకోవాలనే ఉద్దేశంతో జగన్ వర్గీయులు ఉన్నట్లు కనిపిస్తోంది. మెజారిటీ శాసనసభ్యుల మద్దతు మాత్రం జగన్ కే ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అది మాత్రమే సరిపోదు. పార్టీ అధిష్ఠాన వర్గం ఏది చెప్తే అది వినాల్సిన పరిస్థితే కాంగ్రెసులో ఉంటుంది. అయితే ఒత్తిడి ద్వారా కాంగ్రెసు అధిష్ఠాన వర్గం నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలనే ఉద్దేశంతో వైయస్ జగన్ లాబీ ఉంది. అయితే ఈ లాబీ ఒత్తిడి వ్యవహారాలు శృతి మించుతున్న దాఖలాలు ఉన్నాయి. పార్టీని చీలుస్తామనే పద్ధతిలో హెచ్చరికల వ్యవహారం నడుస్తోంది. ఈ వ్యవహారాన్ని పార్టీ అధిష్ఠాన వర్గం తీవ్రంగానే పరిగణనలోకి తీసుకుంటోంది. ఇప్పుడు ఒత్తిడిని కాంగ్రెసు అధిష్ఠాన వర్గం ఎలా తీసుకుంటుందనేది ప్రశ్నార్థకంగానే ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+