పెళ్లి వార్తలపై రాణీ ముఖర్జీ గోడు

జుహు భవంతి కలిసి రాకపోవడంతో పాత ఇంటికి మారుతున్నట్లు వచ్చిన వార్తలను కూడా ఆమె ఖండించింది. కొత్త భవనాన్ని తాను తన కుటుంబం కోసం తీసుకున్నానని, తన శ్రమతో, చెమటరక్తం ఓడ్చి దాన్ని కట్టుకున్నానని, అది తన దేవాలయం అని, దాని నుంచి ఎలా పారిపోతానని, తాను అభద్రతా భావానికి గురయ్యే వ్యక్తిని కానని ఆమె అన్నది. నిరాధారమైన వార్తలు తనకు నష్టం చేస్తున్నాయని ఆమె తన గోడు వెళ్లబోసుకుంది.
ఆదిత్యా చోప్రాను వివాహం చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలను కూడా ఆమె ఖండించింది. తాను తల్లిదండ్రులకు ఒకతే కూతురు అని, పెళ్లి చేసుకోవాలనుకుంటే బహిరంగంగా ప్రకటిస్తానని ఆమె చెప్పింది. ఊహాగానాలకు సమాధానం చెప్పి సమయం వృధా చేసుకునే బదులు తాను తన చిత్రాలపై దృష్టి పెడతానని ఆమె అన్నది. దిల్ బోలే హడ్డిపలో తాను బికినీ ధరించలేదని రాణీ ముఖర్జీ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications