జగన్ పై చెప్పలేను: రాహుల్

వైయస్ జగన్ ను కేవలం ఒక రాజకీయ నాయకుడి కుమారుడిగానే చూడవద్దని, జగన్ సొంతంగా సాధించిన విజయాలున్నాయని ఆయన ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ ఉపాధి పథకం అద్భుతంగా అమలైందని, పేదలు దారిద్ర్య రేఖకు దిగువగా దిగజారకుండా కాపాడిందని ఆయన అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని వస్తున్న డిమాండ్ పై ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. జగన్ వ్యవహారంపై మాట్లాడే విషయంలో తనకూ కొన్ని పరిమితులున్నాయని ఆయన అన్నారు. ఆ విషయంపై మాట్లాడడానికి తన అనుభవం సరిపోదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications