రజనీకి కాంగ్రెసు పిలుపు: రాహుల్

Rajinikanth
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను కాంగ్రెసు పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ చెప్పారు. తమిళనాడు పర్యటనకు వచ్చిన ఆయన గురువారం ఉదయం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.కాంగ్రెసులో యువశక్తిని బలోపేతం చేయడమే తన లక్ష్యమని ఆయన అన్నారు. తమిళనాడులో యువశక్తికి సరికొత్త ద్వారాలు తెరుస్తున్నామని ఆయన చెప్పారు. డిఎంకె తమకు ఇప్పటికీ మిత్రపక్షమేనని, అయితే పొత్తులపై మాట్లాడే అనుభవం తనకు లేదని ఆయన అన్నారు. తమిళనాడులో కాంగ్రెసు ఒంటరిగా పోటీ చేసే శక్తిని సమకూర్చుకోవాలనేదే తన ఉద్దేశమని ఆయన చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి తనకు చాలా విషయాల్లో స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు.

ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి పార్టీలోనూ గ్రూపులున్నాయని, కాంగ్రెసు పార్టీ ఒక్కటే దానికి ప్రతీక కాదని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ బుధవారం కాంగ్రెసు పార్టీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. డిఎంకె, అన్నాడియంకెల వెనక కాంగ్రెసు పడిపోకూడదని, సొంత శక్తి సమకూర్చుకోవడానికి కృషి చేయాలని ఆయన రాష్ట్ర కాంగ్రెసు నేతలకు సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+