విడిగానే ఉంటాం: భుజబల్

Sarad Pawar-Pranab Mukherjee
ముంబై: కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ విదేశీయత ప్రస్తుతం ప్రాసంగికం కాకపోయినప్పటికీ తమ పార్టీ విడిగానే ఉంటుందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపి నేత ఛగన్ భుజబల్ అన్నారు. ఎన్సీపి తన అస్తిత్వాన్ని కాపాడుకుంటుందని ఆయన చెప్పారు. అన్ని వార్తా పత్రికలు, అన్ని టెలివిజన్ చానెల్స్ ఎందుకున్నాయని, మంచివి నిలబడిపోతాయని, సిద్ధాంతం ఒక్కటే అయినా రెండు పార్టీలు ఉండవచ్చు అని ఆయన ఒక వార్తా సంస్థ ప్రతినిధితో అన్నారు.

సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్ ల మధ్య సైద్ధాంతిక తేడాలు ఏమీ లేవని, అలాగే అన్నాయడింకె, డిఎంకెల సిద్ధాంతాలు ఒక్కటేనని ఆయన చెప్పారు. సిద్ధాంతాలు ఒక్కటే అయినంత మాత్రాల ఒకే పార్టీగా ఉండాల్సిన అవసరం లేదని, రిపబ్లికన్ పార్టీ సిద్ధాంతంతో ఏకీభవించే పార్టీలు చాలా ఉన్నాయని ఆయన అన్నారు. తాము పటిష్టంగా ఉన్నామని, తమకు ప్రజాబలం ఉందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+