ఎన్సీపితో పొత్తుపై రేపు: దేశ్ ముఖ్

దేశ్ ముఖ్ కాంగ్రెస్ ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ గా నియమితులయ్యారు. అందుకు ఆయన సోనియాకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్సీపితో పొత్తు పెట్టుకునే సందర్బంలో పార్టీకి తగినన్ని సీట్లు వచ్చేలా చూడాలని సోనియా తనకు సూచించినట్లు ఆయన తెలిపారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెసు 164 సీట్లకు, ఎన్సీపి 124 సీట్లకు పోటీ చేశాయి. ఈసారి కాంగ్రెసు ఎక్కువ సీట్లకు పట్టుబట్టే అవకాశం ఉంది. లోకసభ ఎన్నికల్లో ఎన్సీపి తగిన ఫలితాలు సాధించకపోవడం కాంగ్రెసుకు అనుకూలంగా మారింది. ఎన్సీపికి ఎక్కువలో ఎక్కువ 110 సీట్లు ఇవ్వాలని కాంగ్రెసు ఆలోచిస్తోంది.












Click it and Unblock the Notifications