జగన్ రేసులో ఉన్నాడు: మొయిలీ

Veerappa Moily
న్యూఢిల్లీ: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేసే విషయాన్ని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ తోసిపుచ్చలేదు. జగన్ ఇంకా ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్నాడని ఆయన సిఎన్ఎన్ - ఐబిఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. వైయస్ మృతితో అనాథలైన స్థితిలో తమకు మద్దతుగా రాగలనుకున్నవారిని ప్రతిపాదించారని ఆయన అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని వైయస్ భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగకుండానే డిమాండ్ చేయడాన్ని ఆయన తప్పు పట్టలేదు. అది భావోద్వేగపరమైన ఆందోళన అని, దాన్ని వ్యతిరేకంగా తీసుకోకూడదని ఆయన అన్నారు. తాము ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.

తాను జగన్ పని విధానాన్ని చూశానని, జగన్ విజయవంతమైన ఎంటర్ ప్రెన్యూర్ అని, ఒక పత్రికను, టీవీ చానెల్ ను నడుపుతున్నాడని ఆయన అన్నారు. వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు అనేవి రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య తేడా ఉంటుందని, కేసు నుంచి కేసుకు తేడా ఉంటుందని ఆయన అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచన వారసత్వ రాజకీయాలు, కుటుంబ ఆధిపత్యం కాదా అని వేసిన ప్రశ్నకు ఆయన ఆ విధంగా సమాధానమిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+